దానిమ్మలో పోషకాలు
మనలో రక్తహీనత సమస్య వున్నప్పుడు, వైద్యుల సలహా మేరకు దానిమ్మ పండు తీసుకుంటాము. ఇందులో ఎర్ర రక్తకణాల పెరుగుదలకు ఎంతగానో అవసరం అయ్యే పోషకాలు ఉంటాయి. ఈ పండు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.........
- దానిమ్మలో విటమిన్ 'ఎ', 'సి','ఇ', 'బి5', "ప్లేవనైడ్స్" మరియు "యాంటీ యాక్సిడెంట్" లు సమృద్ధిగా వుంటాయి. కణాల విధ్వంసం కారణంమయ్యే "ప్రీ రాడికల్స్ " కు వ్యతిరేకం గా పోరాడి, నిత్యం యవ్వనంగా ఉండడానికి తోడ్పడుతాయి. వయస్సు పెరగడం ద్వారా వచ్చే ముడతలు రాకుండా అడ్డుకుంటాయి. "అల్జీమర్స్", "రోమ్ము", "చర్మ కాన్సర్" రాకుండా కాపాడడం జరుగుతుంది.
- దానిమ్మ కి సహజ "యస్పరిన్ గుణాలు" ఉన్నాయి. ఇవి రక్త నాళాల్లో ఎటువంటి అడ్డంకులు లేకుండా చేసి, రక్త ప్రసరణ వేగంగా జరగడానికి ఉపయోగపడుతుంది.
- దానిమ్మలో "కాల్షియం" వుంటుంది. ఇది ఎముకలు ఆరోగ్యంగానూ వుండటానికి ఉపయోగపడుతుంది.
- దానిమ్మలో "విటమిన్ కె" వుంటుంది. ఇది రక్తం గడ్డ కట్టడంలో తోడ్పడుతుంది.
- దానిమ్మలో "విటమిన్ ఎ" , కంటి వ్యాధిలను నివారించి, కంటి చూపును మెరుగు పరుస్తుంది.
- ఇందులో "ఫోలిక్ ఆమ్లం" వుంటుంది. ఇది గర్భిణి స్త్రీల కడుపు లో బిడ్డ పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
- ఇందులో "యాంటీ బ్యాక్టీరియల్" , "యాంటీ వైరల్ గుణాలు" వుండటం వల్ల "నోటిపూత" నుంచి కాపాడడం, "అల్సర్" లను నివారిస్తాయి. దంతాలా చిగురులను బలపరుస్తాయి.
- దానిమ్మ రసంలో వుండే రసాయనాలు "కోల్ స్ట్రాల్" వల్ల వచ్చే సమస్యలనూ తగ్గింస్తుంది.
- దానిమ్మ తొక్క లో వుండే "ఔషధ గుణాలు" గాయాలు మాన్పుడంలో ఉపయోగపడుతాయి.
- దానిమ్మలో "ఫైబర్" పుష్కలంగా వుంటుంది. దీని వల్ల జీర్ణావ్యవస్థ మెరుగు పడుతుంది. దీని వల్ల ఆకలి తగ్గి బరువు పెరగడం తగ్గింస్తుంది. ఎన్నో రకాల కడుపు సమస్యలనూ నివారిస్తుంది.
- దానిమ్మలో "ఐరన్" అత్యధికంగా ఉంటుంది. ఇది "రక్త హీనతను" పోగొడుతుంది. అనగా "ఎర్ర రక్తకణాల" పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
- దానిమ్మలో పుష్కలంగా "విటమిన్ సి" వుండటం వల్ల , శరీరం లో "ఐరన్" ను తగు మొతాదులో నియంత్రింస్తుంది.
- దానిమ్మలో పుష్కలంగా "యాంటీ యాక్సిడెంట్ లు" వున్నాయి. పరగడుపున దానిమ్మ తీసుకోవటం వల్ల, ఇందులో "యాంటీ యాక్సిడెంట్ లు" "రోగనిరోధక శక్తి" ని పెంచి, ఈ వ్యవస్థ కడుపులోని బ్యాక్టీరియా, వైరస్ లతో పోరాడి ఇన్ఫెక్షన్ లను తగ్గింస్తాయి.
- దానిమ్మ పండు రసంలో అధికంగా "పాలిఫేనోల్స్" వుంటాయి. ఇది ముఖ్యమైన ఒక "యాంటీ యాక్సిడెంట్". ఇది "కడుపు నొప్పి" , "కండ్లకలక", "ఆస్టియోఆర్థరైటిస్" మరియు "హేమెరాయిడ్స్" వంటి సమస్యలనూ తగ్గింస్తుంది.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి