నేరేడు పళ్ళు ప్రయోజనాలు

Jamun fruit
వర్షం కాలంలో లభించే ముఖ్యమైన పండు లో  నేరేేేడు పండు ఒక్కటి. నేరేడు  పండు లో విటమిన్ బి మరియు విటమిన్ సి వంటి విటమిన్లు, మెగ్నీషియం, కాల్షియం వంటి  ఖనిజాలతో సమృద్ధిగా వుంటాయి.  వీటి వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరగడం,  ఎముకలు ఆరోగ్యంగానూ, దృఢంగా ఉండటానికే కాకుండా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. 
    • నేరేడు విత్తన సారం రేడియోప్రోటెక్టీవ్ చర్యలు కలిగి ఉంటుంది. ఇది వారసత్వం పరంగా వచ్చే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గింస్తుంది. 
    • నేరేడు పళ్ళు రోమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గింస్తుంది.
    • నేరేడు పళ్ళ గుజ్జు సారానికి శక్తివంతమైన క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయి. 
    • నేరేడు పళ్ళ గుజ్జు యాంటీ మైక్రోబియల్ చర్యలను కలిగి ఉంటుంది. ఇవి చర్మ ఇన్ఫెక్షన్ కలిగించే బాక్టీరియా మరియు ఫంగస్ లపై పోరాడుతాయి.
    • నేరేడు పళ్ళ లో  పుష్కలంగా ఆంథోసైనిన్ అనే బయోఆక్టివ్ సమ్మేళనం వుంటుంది. ఇది ఒక రకమైన యాంటీ యాక్సిడెంట్. ఇది కడుపు లో ఆక్సిజన్ మరియు నైట్రోజన్ల రియాక్టీవ్ చర్యలను నిరోధిస్తుంది. అతిసారం, అజీర్ణం, ఉబ్బరం వంటి జీర్ణాశయ సమస్యలనూ తగ్గింస్తుంది. 

    • Jamun tree
    • ఇందులో వుండే ఐరన్ రక్తాన్ని శుద్ధిచేసి మొటిమలు సమస్యను తగ్గింస్తుంది. మనలో ఎర్ర రక్తకణాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఇది రక్తహీనతను పోగొడుతుంది. 
    • ఇందులో ఫైబర్ కూడా తగు మోతాదులో వుంటుంది. ఇది జీర్ణక్రియ ను మెరుగు పరుస్తుంది. ఇది జీర్ణాశయ సమస్యలనూ తగ్గింస్తుంది. 

    • Jamun fruit
    • దీని లో పొటాషియం వుంటుంది. ఇది రక్త పోటును నిర్వహించడం ద్వారా గుండె ని ఆరోగ్యంగా ఉండడానికి ముఖ్య పాత్ర వహిస్తుంది. 
    • నేరేడు పళ్ళ విత్తనాలు  శక్తివంతమైన యాంటీ ఇన్ఫలమేటరీ ప్రభావాన్ని కలిగి వుంటాయి. ఈ ప్రభావం వల్ల ఆర్థరైటిస్ వంటి వ్యాధుల విషయంలో వాపును తగ్గించడానికి తోడ్పడుతుంది. 
    • నేరెడు విత్తనాలకు వుండే ఔషధ గుణాలు వల్ల , గ్లూకోజ్ అధికంగా ఉత్పత్తి అయినప్పుడు పిండి పదార్ధాలను చక్కెరగా మారడాన్ని నియంత్రింస్తుంది. 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పుచ్చ కాయ ప్రయోజనాలు