వేసవిలో మనము డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో నీరు ఎక్కువగా తీసుకోవాలి. ఈ కాలంలో నీరు ఎక్కువ స్థాయి లో వుండే పండ్లు గమనిస్తాం. ఈ పండ్లు లో ఎక్కువ స్థాయి నీరు, ముఖ్యమైన పోషకాలు వుండే కర్బూజ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం ................................
- కర్బూజ కాయ లో అధికంగా 92% నీరు వుంటుంది. ఈ నీరు డీహైడ్రేషన్ సమస్య నుంచి కాపాడడం, అదే కాకుండా తక్షణ శక్తిని అందిస్తుంది.
- కర్బూజ కాయ లో లైకోపెన్ అనే పదార్థం పుష్కలంగా వుంటుంది. ఈ పదార్థం గుండె కు సంబంధించిన సమస్యలను పారద్రోలుతుంది.
- ఇందులో వుండే పీచు పదార్థం మరియు ఔషధం గుణాలు వల్ల అజీర్తి, ఎగ్జిమా, యూరిన్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలనూ నివారిస్తుంది. ఇంకా కిడ్నీ లో రాళ్లు కరగడానికి తోడ్పడుతుంది. మన జీర్ణావ్యవస్థ సరిగ్గా లేకపోయినా, మనం ఎన్నో రకాల సమస్యలనూ ఎదురుకుంటున్నాం.
- కర్బూజ కాయ లో కోవ్వులు స్వల్పంగా వుండి, బరువు తగ్గడానికీ ఎంతగానో తోడ్పడుతుంది. కర్బూజ విత్తనాలలో పొటాషియం అధికంగా వుంటుంది. ఇది బొజ్జ లో వుండే కోవ్వును తగ్గించడానికి తోడ్పడుతుంది. అంతేకాదు పొటాషియం రక్త పోటును అదుపులో వుంచి, గుండె కండరాలు ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
- కర్బూజ లో ఔషధ గుణాలు పుష్కలంగా వుండటం వల్ల డయాబెటిస్ ను నియంత్రణలో వుంచడానికి తోడ్పడుతుంది.
- ఇందులో విటమిన్ సి పుష్కలంగా వుంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, అల్సర్లను నివారించడానికి తోడ్పడుతుంది. వర్షాకాలంలో మనకు విటమిన్ సి ఎంతో అవసరం.
- కర్బూజ కాయ లో అధికంగా బీటాకెరోటిన్, విటమిన్ సి లు వున్నాయి. మన రోగనిరోధక శక్తిని పెంచడంలో, క్యాన్సర్ కారణంమయ్యే ఫ్రీ రాడికల్స్ తో పోరాడి క్యాన్సర్ వ్యాప్తిని నిరోధిస్తుంది.
- కర్బూజ కాయ లో విటమిన్ కె మరియు విటమిన్ ఇ అధికంగా వుంటాయి. ఇవి ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి తోడ్పడుతాయి. అంతేకాదు రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా చేస్తాయి. మనకు గాయాలు అయ్యినప్పుడు, రక్తం కారకుండా గడ్డ కట్టడంలో విటమిన్ కె తోడ్పడుతుంది.
- కర్బూజ పండు రసం ను తాగితే, మెదడుకు ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి, ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది. అంతేకాదు రక్తంలోని చక్కెర శాతన్ని క్రమబద్ధీకరణ చేస్తుంది.
- ఈ పండు లో ఫోలిక్ ఆమ్లం అధికంగా వుంటుంది. ఇది గర్భిణీ కడుపు లో బిడ్డ పెరుగుదలకు ఎంతగానో అవసరం.
- ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా వుంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరిచి, కంటి సమస్యలనూ నివారిస్తుంది.
- ఇందులో క్యాల్షియం మరియు ఫాస్ఫరస్ ను కలిగి ఉంటుంది. ఇవి ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతాయి.
- ఇందులో ఐరన్ వుండి, రక్తంలో హిమెగ్లోబిన్ పెరుగుదలకు ఉపయోగపడి, రక్త హీనతను పోగొడుతుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి