ద్రాక్ష పండు ప్రయోజనాలు
- ఈ నల్లని ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్స్ ధర్మాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన అనవసరమైన టాక్సిన్స్ ను శరీరం నుండి బయటకు పంపించేందుకు తోడ్పడతాయి. ఈ నల్లని ద్రాక్షల క్యాలరీలు తక్కువగా లభిస్తాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు.
- ద్రాక్ష పండు లో రెస్వెరాట్రాల్ అనే ఒక రకమైన సహజ ఫెనోల్ బ్లాక్ గ్రేప్స్ లో లభిస్తుంది ఇది ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం, అలాగే సున్నితత్వాన్ని పెంపొందించి రక్త చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరణ చేస్తుంది .
- ఈ నల్లని ద్రాక్ష లు అధికంగా ఫైటో రసాయనాలు ఉంటాయి ఇవి గుండె కండరాలను ఆరోగ్యంగా ఉంచి, గుండె సమస్యలనూ నివారిస్తాయి.
- నల్లని ద్రాక్షలు లూటీన్ మరియు జిగ్జాంథిన్ అనే కరోటినాయిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇవి కంటిచూపును మెరుగు పరచడం, కంటి సమస్యలను నివారించడం జరుగుతుంది అంతేకాకుండా రెటీనాకు జరిగే ఆక్సిడేటివ్ నష్టాన్ని అడ్డుకుంటాయి. దీనిద్వారా అంధత్వం బారిన పడకుండా కాపాడుతాయి .
- నల్లని ద్రాక్ష లు యాంటీ మ్యూటజెనిక్ మరియు యాంటీఆక్సిడెంట్స్ ధర్మాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది రొమ్ముక్యాన్సర్ మొదలైన వివిధ రకాల కేన్సర్లను నివారించేందుకు తోడ్పడతాయి.
- ఈ ద్రాక్షలు యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇవి కపాలంకి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తాయి. దీని ద్వారా జుట్టు రాలిపోయే సమస్యలను అరికట్టడానికి తోడ్పడతాయి. అంతేకాదు స్ల్పిట్ ఎండ్స్ ని మరియు ప్రీమెచ్యూర్ గ్రే హెయర్ ను అరికడతాయి.
- ఈ ద్రాక్షలు చక్కెరలు మరియు ఆమ్లాలు లభిస్తాయి. ఇవి మలబద్ధకం మరియు కిడ్నీ సమస్యలను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి.
- ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి మరియు విటమిన్ కే అలాగే అలాగే ఫ్లేవనాయిడ్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో విటమిన్ కె రక్తం గడ్డకట్టడంలో ప్రముఖ పాత్రవహిస్తుంది. విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరిచి, కంటి సమస్యలనూ నివారిస్తుంది.
- ఇందులో రెస్వెరాట్రాల్ అనే పదార్థం అధికంగా ఉంటుంది. ఇది మెటబాలిక్ సిండ్రోమ్ నివారించి, దీని ద్వారా వచ్చే గుండె సమస్యలను, మధుమేహం సమస్యలను అరికడతాయి. అంతేకాదు ఓస్టియెపొరోసిస్ నుంచి కాపాడుతుంది.
- ఈ నల్లని ద్రాక్షలో ఉండే ఔషధ గుణాలు వల్ల మన ఏకాగ్రత శక్తి పెరగడం జరుగుతుంది. అలాగే అలాగే అలాగే మైగ్రేన్ నిమోనియా మరియు అల్జీమర్ వ్యాధులు దరిచేరకుండా ఇవి కాపాడుతాయి .
- ద్రాక్ష రసం లో ఉండే పొటాషియం వల్ల రక్తపోటు తగ్గి పోయి రక్తపోటు స్థిరంగా ఉండడానికి ఉపయోగపడుతుంది.
- ద్రాక్ష లో వుండే అంథోసియానిన్ పరిమాణం వివిధ రకాల గుండె వ్యాధులను తగ్గింస్తుంది.
- ద్రాక్ష లో వుండే యాంటీ యాక్సిడెంట్ లు మరియు ఇతర సమ్మేళనాలు, వృద్ధాప్యం లక్షణాలనుతగ్గించడానికి ఉపయోగపడుతాయి.
- ద్రాక్ష పండు లో బయో యాక్టివ్ సమ్మేళనాలు మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను చూపిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
- ద్రాక్ష పై తోలు నుండి తీసిన సారాలు ఫ్లూ వైరస్ కు వ్యతిరేకంగా పోరాడటం జరుగుతుంది.
- ద్రాక్ష లో వుండే ఔషధ గుణాలు చికెన్ పాక్స్ మరియు హెర్పిస్ వైరస్ పెరుగుదలను మరియు వ్యాప్తిని నిరోధిస్తుంది.
ద్రాక్ష ఆకుల ఉపయోగాలు
ద్రాక్ష ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఈ ఆంటీ ఆక్సిడెంట్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచడం లోనూ తోడు పెంచడానికి తోడ్పడతాయి. ద్రాక్ష ఆకులను మనము వేడినీటిలో మరిగించి కాషాయం లాగా రోజు ఉదయం త్రాగిన చొ మనలో అనేక రకాలైన నిర్మూలించవచ్చు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉండడం వల్ల ఇవి క్యాన్సర్కు కారకాలైన ఫ్రీరాడికల్స్ తో వ్యతిరేకంగా పోరాడి క్యాన్సర్ను నివారించడానికి ఎంతగానో తోడ్పడుతాయి.
- ద్రాక్ష ఆకులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఈ కాల్షియం ఎముకలు దృఢంగా ఉంచడంలోనూ కండరాలు ఆరోగ్యంగా గట్టిగా ఉండడం లోనూ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పొటాషియం కూడా పుష్కలంగా వుంటుంది. రక్తపోటు ను అదుపులో ఉంచి, గుండె సంబంధించిన వివిధ రకాలైన సమస్యలను నిర్మూలించడంలో ఎంతగానో తోడ్పడుతుంది.
- ద్రాక్ష ఆకుల లో విటమిన్ ఏ విటమిన్ సి మరియు వివిధ రకాలైన బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ విధంగా అన్ని పోషకాలు కలిగి ఉండి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్ ఏ కళ్ళు ఆరోగ్యంగా ఉంచడంలోనూ, కంటి సంబంధ సమస్యలను నిర్మూలించడానికి ఉపయోగపడుతుంది. విటమిన్-సి వ్యాధి నిరోధక శక్తిని పెంచి మన ఆరోగ్యం మన శరీరంలో ప్రవేశించి వివిధ రకాల క్రిములను నాశనం చేయడంలో ఎంతగానో తోడ్పడుతుంది. ద్రాక్ష ఆకులను వేపుడు లాగా చేసుకుని ఆహారంలో ఉపయోగించుకుంటారు. ఇందులో పుష్కలంగా ఫైబర్ కలిగి ఉండటం వల్ల, మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలోనూ మలబద్ధకాన్ని నివారించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
- ద్రాక్ష ఆకులను మరిగే నీటిలో వేసి ఆ నీటితో మనం స్నానం చేసినచో, శరీరం పైన ఉండే వివిధ రకాలైన క్రిములను నివారించడంలో ఎంతగానో తోడ్పడతాయి. ఇందులోనే ఔషధగుణాలు ఉండడంవల్ల వివిధ రకాలైన చర్మ సమస్యలను తొలగించడంమే కాకుండా శరీరాన్ని ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచడంలో ఎంతగానో తోడ్పడుతుంది.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి