సీతాఫలం ప్రయోజనాలు

Seetha Fruit

వర్షం కాలంలో సహజంగా అడవుల్లో పెరిగే మంచి పండు  సీతాఫలం. ఇది చాలా తియ్యనైనా పండు మరియు అన్నీ రకాల పోషకాలు  పుష్కలంగా   ఉన్నాయి. ఈ పండు ప్రయోజనాలను తెలుసుకుందాం............. 
  • సీతాఫలంలో "విటమిన్ బి6" అధికంగా వుంటుంది.  ఇది "బ్రోంకైల్ ఇన్ల్పమేషన్" తగ్గించి "ఆస్త్మాటిక్స్ అటాక్" ను తగ్గింస్తుంది. 
  • సీతాఫలం లో పుష్కలంగా మెగ్నీషియం వుంటుంది. ఇది గుండె పోటు నుండి రక్షిస్తుంది. 
  • సీతాఫలం లో "కాఫర్" మరియు "డైటర్ ఫైబర్" అధికంగా వుంటుంది. వీటి వల్ల జీర్ణక్రియ మెరుగుపడి, మలబద్ధకాన్ని నివారిస్తాయి. ఇందులో అధికంగా వుండే   "డైటర్ ఫైబర్" ...షుగర్ స్థాయిలను క్రమబద్ధీకరణ చేస్తుంది.  టై2 డయాబెటిస్ తగ్గింస్తుంది. 

  • Custard apple
  • సీతాఫలం లో పుష్కలంగా పొటాషియం మరియు మెగ్నీషియం వుండి,  ఈ రెండు రక్త పోటును అందుపులో వుంచుతాయి. ఇందులో  మెగ్నీషియం నీరు స్థాయిలను క్రమబద్ధీకరణ చేస్తూ, కీళ్ళలోని యాసిడ్స్ ని బయటకు తరిమేసి....రుమటిజం, కీళ్ళనొప్పులకు చెక్ పెడుతుంది. 
  • సీతాఫలం లో పుష్కలంగా "నియాసిన్" మరియు "డైటర్ ఫైబర్" వుంటాయి.  ఇవి "కోల్ స్ట్రాల్ స్థాయి"లను తగ్గిస్తాయి. 
  • సీతాఫలం లో పుష్కలంగా "ఐరన్" వుంటుంది. ఇది రక్త హీనతను పోగొడుతుంది. 
  • సీతాఫలం లో పుష్కలంగా విటమిన్ ఎ, విటమిన్ సి మరియు రెబోప్లెవిన్ వుంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడి,  కంటి చూపును మెరుగుపరుస్తాయి. కంటి వ్యాధులను నివారిస్తాయి . ఇందులో  విటమిన్ ఎ,  మన చర్మాన్ని,  జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది. 
  • సీతాఫలం లో విటమిన్ బి మరియు కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకలు దృఢంగా ఉండటానికి,  కండరాలు, నరాల బలహీనతలను అధికమించడానికి తోడ్పడుతాయి. 
  • ఇందులో వుండే "యాంటీ యాక్సిడెంట్" లు క్యాన్సర్ కారకాలను నివారిస్తాయి.
  • ఇందులో వుండే "సల్ఫర్" చర్మ వ్యాధులను నివారిస్తుంది. 
  • సీతాఫలం ఆకుల లో వుండే ఔషధ గుణాల వల్ల,  వీటిని నూరి, పసుపు కలిపి తామర, గాయాలకూ కడితే మానిపోతాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పుచ్చ కాయ ప్రయోజనాలు