పుచ్చ కాయ ప్రయోజనాలు



Water melon

వేసవి కాలంలో లభించే ముఖ్యమైన కాయలలో పుచ్చ కాయ ఒకటి.  ఈ కాయలో 92% నీరు కలిగి వుండటం వల్ల,  ఈ కాలంలో డీహైడ్రేషన్ సమస్యతో బాధపడే వారికి ఎంతో మేలు చేస్తుంది. ఇది నీరు మాత్రమే కాదు,  అన్ని పోషకాలు మరియు ఖనిజాలను కలిగి వుంటుంది. పుచ్చ కాయ లోని పోషకాలు,  వాటి అవసరం గురించి తెలుసుకుందాం...........
  • పుచ్చ కాయలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, క్లోరిన్, కెరోటిన్, రకరకాల విటమిన్ లు పుష్కలంగా ఉన్నాయి. 
  • పుచ్చ కాయ లో సిట్రులిన్ అనే అమైనో యాసిడ్ వుండి, ఇది సిస్టోలిక్ మరియు డయాస్టోలిక్ రక్త పోటును అదుపులో వుంచి,  గుండె కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. 
  • పుచ్చ కాయ లో పుష్కలంగా లైకోపిన్ అనే శక్తివంతమైన యాంటీ యాక్సిడెంట్ లు వున్నాయి. ఇవి డీ.ఎన్.ఎ. నష్టాన్ని కలిగించే ఫ్రీ రాడికల్స్ తో వ్యతిరేకంగా పోరాడి నాశనం చేస్తాయి. ఈ లైకోపిన్ రక్తం లోని గ్లూకోస్ స్థాయిలను క్రమబద్ధీకరణ చేస్తుంది. ఈ పదార్థం  రోమ్ము క్యాన్సర్,  ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతాయి. ఈ పదార్థం  వల్ల పురుషుల్లో శుక్రకణాలు  అధికంగా ఉత్పత్తి  చేసి , ఎక్కువగా సజీవంగా వుండటానికి తోడ్పడుతుంది. 
  • ఈ కాయలో అధికం శాతం  నీరు వుండటం వల్ల,  ఇది శరీరం నుండి అదనపు ఉప్పులను మరియు  టాక్సిన్లు  తీసివేయడం ద్వారా మూత్రపిండాలు ఆరోగ్యంగా వుంటాయి. ఇది శరీరాన్నికి చలవ చేస్తుంది. 
  • Water melon


  • ఇందులో  ఔషధ గుణాలు వుండటం వల్ల , గర్భిణి స్త్రీ లలో సంభవించే వ్యాధులు  ప్రీఎక్లంప్సియా మరియు గర్భాశయంలో పెరుగుదల తగ్గిపోవడం వంటి సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొవడానికి ఉపయోగపడుతాయి. 
  • ఇందులో వుండే కాల్షియం,  ఎముకలు దృఢంగా ఉండటానికి, ఆరోగ్యంగానూ వుండటానికి తోడ్పడుతుంది. ఇది కీళ్లనొప్పుల్నీ, వాతరోగాన్నీ నివారిస్తుంది. 
  • ఈ కాయలో వుండే ఔషధం గుణాలు వుండటం వల్ల,  ఇది మూత్రంలో యూరిక్ ఆమ్లాన్ని తగ్గింస్తుంది. 
  • ఇందులో కోవ్వు పదార్ధాలు తక్కువగా వుండి, పీచు పదార్థాలు అధికంగా వుండి బరువు తగ్గడానికీ ఎంతగానో తోడ్పడుతుంది. ఈ పీచు పదార్థం జీర్ణక్రియ ను మెరుగుపరిచి,  కడుపు సంబంధిత సమస్యలనూ తగ్గింస్తుంది.
  • ఈ కాయలో విటమిన్ ఎ పుష్కలంగా వుంటుంది. ఇది కంటి చూపు ను మెరుగుపరిచి, కంటి సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. ఇది మ్యాక్యులర్ డీజెనరేషన్ సైతం నివారిస్తుంది. 
  • ఇందులో విటమిన్ సి మరియు విటమిన్ బి లు పుష్కలంగా ఉన్నాయి.  ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతే కాదు చర్మ వ్యాధులను నివారించడంలో విటమిన్ బి లు ఉపయోగపడుతాయి. 
  • ఇందులో వుండే పొటాషియం, రక్తపోటును అదుపులో వుంచి గుండె కండరాలు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. 

కామెంట్‌లు