సపోట పండు చాలా తియ్యగా వుంటూ, మనకి అవసరమైన పోషకాలు లభిస్తాయి. ఈ పండు ప్రయోజనాలు చూద్దాం.......
- సపోట పండు లో తక్షణ శక్తిని ఇచ్చే గ్లూకోస్ ని పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇందులో కెరోటిన్ లు సమృద్ధిగా వుంటాయి. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఇది శరీరం ఉష్ణోగ్రత అధికంగా పెరుగకుండా నియంత్రిస్తుంది.
- సపోట పండు విటమిన్ ఎ అధికంగా వుంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. ఇది రేచీకటి ని తగ్గింస్తుంది. ఇది వృద్ధాప్యంలో కంటి చూపును మెరుగు పరుస్తుంది. ఇది ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్ నుండి రక్షిస్తుంది.
- సపోట పండు లో టన్నిన్ అనే పదార్థం అధికంగా వుంటుంది. ఇది యాంటీ-ఇంఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేసి, పేగు శోధము, చికాకుపెట్టే పేగు వ్యాధి, పొట్టలో పుండ్లు వంటి వ్యాధుల నివారిస్తుంది.
- సపోట పండు లో విటమిన్ ఎ, బి శరీరంలోని శ్లేష్మ క్రమీకరణకు, చర్మం ఆరోగ్య నిర్మాణ నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
- సపోట పండు లో యాంటీ యాక్సిడెంట్ లు వున్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతూ, క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పోరాడి నాశనం చేస్తాయి.
- సపోట పండు లో క్యాల్షియం మరియు ఫాస్ఫరస్ పుష్కలంగా వుంటుంది. ఇది ఎముకలు ఆరోగ్యంగానూ, గట్టిగా వుండటానికి ఉపయోగపడుతుంది.
- ఇందులో ఐరన్ పుష్కలంగా వుంటుంది. ఇది రక్తం లో హిమెగ్లోబిన్ పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఇది రక్త హీనతను పోగొడుతుంది.
- సపోట పండు లో పీచు పదార్థం కలిగి వుండటం వల్ల, మలబద్ధకాన్ని నివారిస్తుంది. మలబద్ధకం వల్ల కడుపు లో ఏర్పడే ఎన్నో అనారోగ్యం సమస్యలు పెరుగుతాయి.
- సపోట పండు లో పిండి పదార్ధాలు, అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు చాలా ఉపయోగకరం. ఇవి నీరసాన్ని, గర్భం సమయంలో వచ్చే వికారం, మైకం వంటి ఇతర లక్షణాలను తగ్గించడానికి ఉపయోగపడుతాయి.
- సపోట పండు లో పాలీఫెనోలిక్ అనామ్లజనకాలు కలిగి వుండటం వల్ల, యాంటీ-వైరల్, యాంటీ-పరాసిటిక్ మరియు యాంటీ-బాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉన్నాయి. ఇవి సూక్ష్మ క్రిములను శరీరంలోకి ప్రవేశించకుండా నాశనము చేస్తాయి.
- ఇందులో పొటాషియం, ఇనుము, ఫోలేట్, నియాసిన్ మరియు పాంతోతేనిక్ లు వున్నాయి. ఇవి జీర్ణావ్యవస్థకు మేలు చేస్తాయి.
- సపోట పండు లో విరేచనకారి లక్షణాలు కలిగి వుండటం వల్ల, అతిసార నిరోధక కారకంగా పనిచేస్తుంది. ఇది జిగట విరోచనాల నుండి ఉపశమనం పొందవచ్చు.
- సపోట పండు శక్తివంతమైన ఉపశమనకారి కావడంతో నరాల ఉద్రుతిని, ఒత్తిడిని, నిద్రలేమి, ఆందోళనను, వ్యాకులతో బాధపడే వారికి ఎంతగానో ఉపయోగకరం.
- సపోట పండు మూత్రవిసర్జన ప్రేరకంగా పనిచేస్తుంది. దీనివల్ల మూత్రవిసర్జన ద్వారా శరీరం నుండి వ్యర్థాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది.
- సపోట పండు లో విటమిన్ ఇ పుష్కలంగా వుంటుంది. ఇది చర్మాన్ని తేమగా వుంచటంలో, చర్మం అందంగా మరియు ఆరోగ్యంగా ఉంటుంది.
- ఇందులో విటమిన్ సి కలిగి వుండటం వల్ల, రోగనిరోధక శక్తి ని పెంచుతుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి