పనస పండు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం
కూరగాయలు ఇతర తృణధన్యాలను
ఆహారంగా తీసుకుంటే, అన్నీరకాల పోషకాలు లభిస్తాయి.
- పనస పండు లో విటమిన్ ఎ,సి, బి6 మరియు కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింక్ ఖనిజాలతో సమృద్ధిగా వున్నాయి. అంతేకాదు ఫైబర్ పుష్కలంగా వుంటుంది.
- పనస పండు తోనలు తినడం ద్వారా మగవారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది. వీర్యవ్యద్ధిని కలిగించి, అంగస్తంభన సమస్యలనూ తగ్గింస్తుంది.
- పనస పండు లో ఫైటోన్యూట్రియంట్స్, ఐసోఫ్లేవిన్స్ కలిగి వుంటాయి. ఇవి క్యాన్సర్ కారకాలతో వ్యతిరేకంగా పోరాడుతాయి. ఇవి అజీర్తి, అల్సర్లను కూడా నివారిస్తుంది.
- పనస పండు లో పొటాషియం అధికంగా వుంటుంది. ఇది రక్త పోటును అదుపులో వుంచి, గుండె కి ఎంతో మేలు చేస్తుంది.
- పనస చెట్టు వేర్లలలో వుండే ఔషధ గుణాలు ఆస్తమా, జ్వరము,డయేరియా మరియు చర్మ వ్యాధులను నయం చేస్తాయి.
- పనస పండు లో వుండే యాంటీ యాక్సిడెంట్ లు శరీరం లో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ తో పోరాడి, కణజాలాల నాశనన్ని అడ్డుకుంటాయి.
- పనస పండు లో వుండే విటమిన్ సి రోగనిరోధక శక్తి ని పెంచుతుంది.
- ఇందులో వుండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. కంటి సమస్యలనూ తగ్గింస్తుంది.
- ఇందులో ఐరన్ వుంటుంది. ఇది రక్త హీనతను పోగొడుతుంది. అంతేకాదు చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరణ చేస్తుంది.
- పనస పండులో క్యాల్షియం పుష్కలంగా వుంటుంది. ఇది శరీరం లోని ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా ఉండటానికి ఉపయోగపడుతుంది.
- ఇందులో ఫైబర్ పుష్కలంగా వుంటుంది. ఇది జీర్ణక్రియ ను మెరుగు పరుస్తుంది. అంతేకాదు కడుపులో ఏర్పడే గ్యాస్ మరియు అల్సర్ వంటి జీర్ణ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.
- పనస పండు శరీరంలోని గ్లూకోస్, ఇన్సులిన్, గ్లెసెమిక్ స్థాయిలను క్రమబద్ధీకరణ చేస్తుంది.
- పనస పండు గింజలను ఎండబెట్టి పొడిగా చేసుకోని తిన్నట్లయతే అజీర్తి సమస్యలు దూరమవుతాయి.
- పనస గింజలలో వుండే లెక్టిన్లు రోగనిరోధక శక్తిని ఉత్తేజపరుస్తాయి.
- ఆస్తమాతో బాధపడేవారికి ఎంతో మేలు చేస్తుంది. పనస వేరును బాగా ఉడికించి దాని నుంచి వచ్చే రసం తీసుకుంటే ఆస్తమా అదుపులో వుంటుంది.
- పనస పండులో ఉన్న ఖనిజ లవణాలు థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి